కొత్త సినిమాతో భారీగా పెరిగిన రామ్ పారితోషికం ? టాలీవుడ్ లో హాట్ టాపిక్

Hero Ram Remuneration hugely increased with new movie

0
107

టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ వరుస సినిమాలతో జోరుమీద ఉన్నారు. యూత్ కి, అలాగే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలతో ఆయన సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాఫ్ అనేది అస్సలు పట్టించుకోకుండా ఒకదాని తరువాత ఒకటిగా ప్రాజెక్టులను లైన్లో పెడుతుంటారు రామ్. మొత్తం 18 చిత్రాలు చేశారు ఆయన. ఇక తాజాగా 19వ సినిమాని కూడా అనౌన్స్ చేశారు.

తమిళ దర్శకుడు లింగుస్వామితో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. సరికొత్త యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు రామ్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సరికొత్త కథ కావడంతో చేసేందుకు ఒకే చెప్పారు.

ఈ సినిమా నుంచి రామ్ పారితోషికం పెంచాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈసినిమాకు రామ్ కు 13 కోట్ల రెమ్యునరేషన్ అందుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లింగు స్వామికి 5 నుంచి 7 కోట్ల మధ్య రెమ్యునరేషన్ ఉండవచ్చని కోలీవుడ్, టాలీవుడ్ టాక్.