తల్లి అవుతున్న మహిళలు ఈ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లవద్దు

Women who are becoming mothers should not go for this food at all

0
68

తల్లి అవుతున్నాను అని వార్త తెలిసిన తర్వాత ఆ మహిళ ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే. ఓ బిడ్డకి జన్మనిస్తున్నాను అని ఆమె ఎంతో ఆనందపడుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెని ఎంతో బాగా చూసుకుంటారు.
ఏ సమయంలో ఏ ఫుడ్ తీసుకోవాలి. ఇలా ప్రతీ డైట్ ఫాలో అయ్యేలా చేస్తారు. గర్భంలో ఉన్న బిడ్డకు అవసరమైన పోషకాలు తల్లి తీసుకునే ఆహారం ద్వారానే అందుతాయి. అందుకే ఆమె మంచి పౌష్టికాహరం, పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి.

ఇక్కడ ఓ విషయం గుర్తించాలి. కొన్ని ఆహార పదార్థాలు గర్భంలోని బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు అని పెద్దలు కూడా చెబుతారు. మరి అలాంటి ప్రతికూల ఆహారాలు ఏమిటి అనేది చూద్దాం.

1. బొప్పాయి తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. దీంతో గర్భస్రావం అవుతుంది అందుకే తీసుకోకూడదు.
2. వర్షకాలంలో తీసుకునే పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లో క్రిములు ఎక్కువగా ఉంటాయి. అందుకే కచ్చితంగా బాగా శుభ్రం చేసి తీసుకోవాలి.
3.రసాయనాలు వాడే పండ్లకు దూరంగా ఉండాలి.
4. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
5.పచ్చి మాంసం, పచ్చి గుడ్లను తీసుకోవద్దు.
6. ఒకేసారి ఎక్కువ ఆహారం కాకుండా మితంగా నాలుగు ఐదు సార్లు తీసుకోండి.
7.ధూమపానం, మద్యాపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.