పెళ్లి అయి మూడు రోజులు – కొత్తగా అద్దెకి వచ్చారు – మూడో రోజు ఇంట్లో దారుణం

ఇంటిలోకి వచ్చిన మూడు రోజుల తర్వాత ఆ జంట అసలు ఆమెకి కనిపించలేదు

0
130

కొత్తగా ఎవరైనా వచ్చి ఇల్లు అద్దెకు కావాలి అని అడిగితే కాస్త ఇంటి ఓనర్లు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే జరుగుతున్న ఘటనలు అలాంటివి. వేరే చోట నుంచి వచ్చినా వారి వివరాలు సరిగ్గా లేకపోయినా, వారికి ఇళ్లు కిరాయికి ఇచ్చేందుకు నో చెబుతున్నారు. అయితే యూపీలో ఇలాగే ఓ ఘటన జరిగింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగర్ జిల్లాలోని అట్రౌలీ పరిధిలో ఉన్న మొహల్లా సరైవలీ ప్రాంతంలో సుశీలా దేవీ అనే మహిళ ఇంట్లోకి ఓ జంట అద్దెకు దిగారు. ఆమె పేరు విమ్లేష్ దేవీ అతని పేరు రవి. ఇటీవల పెళ్లి అయింది. మీ ఇళ్లు ఖాళీ అని తెలిసింది అద్దెకు కావాలి అని ఓ ఇంటి యజమానిని అడిగారు. ఆమె అద్దెకి ఇచ్చింది. అయితే ఇంటిలోకి వచ్చిన మూడు రోజుల తర్వాత ఆ జంట అసలు ఆమెకి కనిపించలేదు. కొత్త జంట కదా బయటకు రావడం లేదు అనుకుంది.

కానీ ఆ రూమ్ నుంచి దుర్వాసన రావడంతో కిటికి నుంచి చూసింది. అక్కడ వారిద్దరు ఉరి వేసుకుని ఉన్నారు. చివరకు పోలీసులు వచ్చారు. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాని అంతకుముందు విమ్మేష్ దేవీకి శిషుపాల్ అనే వ్యక్తితో వివాహమయింది. ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇక వారిద్దరిని ఆమె వదిలేసి పెళ్లికాక ముందు పరిచయం ఉన్న రవితో పారిపోయింది. చివరకు గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక పారిపోయి వచ్చినందుకు బాధతో ఇలా ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.