ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ బిజీబిజీగా గడిపిన బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ అంటూ తండ్రి రామారావు జీవిత చరిత్రలు రెండు భాగాలుగా తెరకెక్కించిన బాలయ్య తాజాగా ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో తన తర్వాత సినిమాపై దృష్టిసారించారు.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో బాలయ్య బాబు సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకి నిర్మాత సి కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో సినిమా మొదలు కాకముందే సినిమా పై ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వినబడుతున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో నిర్మాత సి కళ్యాణ్ వీటికి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఒక పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్ స్టర్ గా మారితే వచ్చే పరిణామాలను ఆధారంగా చేసుకుని ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిద్దిద్దుతున్నట్టు చెప్పారు. మొత్తమ్మీద చూసుకుంటే సినిమాలో డబుల్ షేడ్స్ ఉంటాయి కానీ సింగల్ క్యారెక్టర్ తరహాలో జై సింహ టైపు రెండు పాత్రలలో బాలకృష్ణ నటిస్తున్నట్లు నిర్మాత అంటున్న కామెంట్లు బట్టి తెలుస్తోంది.