వరదలో ఇరికిన కారు : తోసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

0
108

ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారు వరదలో చిక్కుకుపోయింది. ఇదేదో మారుమూల ప్రాంతంలో కాదు. రాజధాని నగరం హైదరాబాద్ లోనే. నిన్న కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. దీంతో వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించేందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురువారం తన నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు బయలుదేరారు.

హస్తినాపురం డివిజన్ సాగర్ ఎన్ క్లేవ్ లో ఆయన పర్యటిస్తుండగా కారు వరదలో చిక్కుకు పోయింది. దీంతో ఆయన దిగారు.  సెక్యూరిటీ సిబ్బంది కారును తోశారు. అయినా కారు బయటకు రాలేదు. తర్వాత ఎమ్మెల్యే కూడా ఒక చేయి వేశారు. ఎంతసేపటికి కూడా  కారు బయటకు రాలేదు. ఇలా ఎమ్మెల్యేను అసహనానికి గురి చేశాయి వరదలు.  చివరికి ఎలాగో అలాగా బయట పడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

కారు తోసిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కింద వీడియో లింక్ ఉంది మీరూ చూడొచ్చు.

https://youtu.be/n-nJ4dbALC0

https://www.facebook.com/alltimereport/videos/153567303536298