మళ్ళి టీడీపీ నాయకులపైనా మండిపడ్డ పోసాని

మళ్ళి టీడీపీ నాయకులపైనా మండిపడ్డ పోసాని

0
81

పోసాని కృష్ణమురళి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రచయితగా 100 సినిమాలకు పైగా పని చేసిన ఈయన.. ఆ తర్వాత దర్శకుడిగా కూడా మారాడు. ఆ తర్వాత నటుడిగా మారి ఏడాదికి కనీసం 40 సినిమాలు చేస్తున్నాడు పోసాని. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నాడు పోసాని కృష్ణమురళి. వైసీపీలో చేరి జగన్ తరఫున ప్రచారం కూడా చేసాడు. ఈ క్రమంలోనే టీడీపీపై ఓ రేంజిలో విరుచుకుపడ్డాడు పోసాని.

అసలు చంద్రబాబు నాయుడు లాంటి నాయకులను నమ్ముకుంటే ఏపీ భవిష్యత్తు నాశనం అయిపోతుందని భారీ విమర్శలే చేసాడు ఈయన.ఎన్నికలు పూర్తి కావడం.. అనుకున్నట్లుగానే జగన్ అధికారంలోకి రావడంతో పోసాని కృష్ణమురళి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఎలక్షన్స్ ఎలాగూ అయిపోయాయి కదా.. రాజకీయాల నుంచి ఫ్రీ అయిపోయి సినిమాలు చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆయనకు అనుకున్నంతగా ఆఫర్లు రావడం లేదంటున్నాడు ఈ రైటర్ కమ్ యాక్టర్. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగుదేశం వాళ్లే ఉన్నారని.. దాంతో తనకు ఆఫర్లు రాకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు పోసాని కృష్ణమురళి.