కొందరికి ఒక్కోసారి అదృష్టం తలుపు తడుతుంది. ఇటీవల చాలా మంది ఇలాగే లాటరీలు గెలుచుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ లాటరీలో కోట్లు గెలుచుకున్న వారిని చూశాం. కేరళకు చెందిన చాలా మంది ఇక్కడ ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసి కోట్లు గెలుచుకున్నారు. విజేతలుగా గెలిచి ఆ డబ్బుతో మంచి వ్యాపారం చేసుకుంటున్నారు. తాజాగా మరో వ్యక్తికి ఇలాంటి జాక్ పాట్ తగిలింది.
మహారాష్ట్రలోని థానేకు చెందిన 36 ఏళ్ల గణేశ్.. బ్రెజిల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా అతడు దుబాయ్, రియో డీ జనెయిరోల మధ్య రాకపోకలు సాగించేవాడు. ఈ సమయంలో దుబాయ్ లో ఈ లాటరి టికెట్స్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా రెండు సంవత్సరాలుగా చాలా సార్లు లాటరీ టికెట్ కొన్నాడు.
అయితే తాజాగా గణేష్ జాక్పాట్ కొట్టేశాడు. రూ.7.45 కోట్ల లాటరీ సాధించాడు. ఈ డబ్బులతో కొత్త కారు, కొత్త ప్లాటు కొంటాను. పిల్లల చదువు కోసం కొంత డబ్బులు దాచుకుంటాను అని చెప్పాడు. ఈ వార్త వినగానే నాకు చాలా ఆనందం కలిగిందని చెప్పాడు గణేష్.