ఒకేసారి ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేసిన ముఖ్యమంత్రి

ఈ వార్త విని అందరూ మీరు చాలా మంచి మనసు కలిగిన ముఖ్యమంత్రి సార్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు

0
91

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ముగ్గురు దత్త పుత్రికలకు వివాహం జరిపించారు. ఈ వార్త విని అందరూ ఆయనని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులని (వ‌రుల‌ని) అదృష్టవంతులు అని అందరూ అంటున్నారు. మధ్యప్రదేశ్లోని విదిశా పట్టణంలోని గణేష్ ఆలయంలో ఈ ముగ్గురు అమ్మాయిలకు ఒకేసారి వివాహం జరిపించారు.

శివరాజ్ సింగ్, ఆయన సతీమణి సాధన వరుల కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. తమ దత్త పుత్రికలకు భారీగా కట్న కానుకలు ఇచ్చి, ఆభరణాలు చేయించి వారికి వివాహం జరిపించారు.
శివరాజ్ సింగ్ చౌహాన్, సాధన దంపతులు 20 ఏళ్ల కిందట అనాథలైన ఏడుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల బాధ్యతలను తీసుకున్నారు. అప్పటి నుంచి వారి బాధ్యతలు ఈ కుటుంబం చూసుకుంది.

తల్లిదండ్రులు, సంరక్షకులు లేని ఆ పిల్లలను విదిశాలోని సుందర్ సేవా ఆశ్రమం చేరదీసింది. వారి గురించి తెలుసుకున్న సీఎం సతీమణి వారి బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు శివరాజ్ ఎంపీగా ఉన్నారు. నాటి నుంచి వీరి బాధ్యత ఈ కుటుంబం చూసుకుని, చదువు చెప్పించి, వారికి మంచి సంబంధాలు చూసి వివాహం జరిపించారు.ఇప్పటికే నలుగురు అమ్మాయిలకి, ఓ యువకుడి పెళ్లి జరిపించారు. నేడు మరో ముగ్గురికి వివాహం జరిపించారు.

ఈ వార్త విని అందరూ మీరు చాలా మంచి మనసు కలిగిన ముఖ్యమంత్రి సార్ అంటూ సోషల్ మీడియాలో
ప్రశంసిస్తున్నారు