కొన్ని పెళ్లిల్లు పీటల వరకు వచ్చి ఆగిపోతాయి. దీనికి పలు కారణాలు ఉంటాయి. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా, కట్నాలు కానుకల విషయం, లేదా వారికి పెళ్లికి ముందు ఏమైనా ప్రేమ ఇలాంటివి ఉంటే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇక ఇలా అన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయితే ఇక ఇరువురు పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది.
ఈ సమయంలో ఇరువురికి పెద్దలు నచ్చచెప్పాలి అని అనుకుంటారు. కాని కొందరు అస్సలు ఈ వివాహం చేసుకోము అని చెబుతారు. ఇక్కడ కూడా ఓ పెళ్లి విషయంలో ఇలాంటిదే జరిగింది.వధువు తక్కువ ఖర్చుతో సింపుల్గా పెళ్లి చేసుకుందామని వరుడిని కోరింది. అయితే, వరుడు ఇందుకు అంగీకరించలేదు. పెళ్లి గ్రాండ్ గా ఉండాలని, ఖర్చులకు వెనకాడవద్దని చెప్పాడు. అయితే పెళ్లి సమయంలో కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవు అని వరుడి తల్లి, అత్తలు వ్యతిరేకించారు. ఇంకా మూడు వారాలు ఉంది ఆ సమయంలో అవన్నీ ఉండాల్సిందే అని పట్టుబట్టారు.
చివరకు అంత ఖర్చులు పెట్టి చేయలేము అని వధువు చెప్పింది. దీంతో వరుడు కూడా ఇంకా పెళ్లికి మూడు వారాలు ఉంది. మనం కలిసి ఉండలేము అందుకే పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే కొద్ది రోజులకి నేను ఖర్చు చేసిన దానిలో సగం క్యాష్ నాకు రావాల్సి ఉంటుంది అన్నాడు పెళ్లికొడుకు. దీనికి ఆమె పెళ్లి నువ్వు వద్దు అనుకున్నావు, ఇక నీకు ఎందుకు డబ్బులు వస్తాయి, ఒకవేళ పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఇప్పుడు రెడీ అని చెప్పింది. ఆ డబ్బులు కూడా వద్దని పెళ్లికి మరోసారి కూడా నో అన్నాడు. ఇది కెనడాలో జరిగినట్లు తెలుస్తోంది.