మనం ఒక్కోసారి చూస్తు ఉంటాం. కొందరిని దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయి. దీనికి పలు కారణాలు చెబుతున్నారు నిపుణులు. మీకు తెలుసా దోమలకు ఉదయం పెద్దగా కళ్లు కనిపించవు.
మధ్యాహ్నం నుంచీ వాటి చూపు బెటర్ అవుతుంది. సాయంత్రం, రాత్రి అయ్యే కొద్దీ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి. అందుకే ఇవి బాగా ముదురు డార్క్ డ్రెస్సులు వేసుకున్న వారిని కుడతాయి.
రెడ్ కలర్ వంటి డ్రెస్ వేసుకున్నవాళ్ల దగ్గరకు ముందుగా వెళ్తాయి. ఇక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే అక్కడే ఉంటాయి. అందుకే ఇలాంటి క్లాత్ లు ఎక్కడైనా ఉంటే అక్కడ దోమలు చాలా ఉంటాయి. అందుకే మీరు రాత్రి పూట లైట్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే బెటర్. O బ్లడ్ గ్రూప్ ఉంటే రెట్టింపు సంఖ్యలో దాడి చేస్తాయి.
ఇక దోమలు కార్బన్ డై ఆక్సైడ్ ని బాగా పీల్చుకుంటాయి. అందుకే మనం వదిలే ఆ కార్బన్ డై ఆక్సైడ్
కోసం మన దగ్గరకు తెగ వస్తాయి. ఇక ఊబకాయం బరువు ఉన్నవారు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ వదులుతారు. అందుకే అవి వారి దగ్గరకు ఎక్కువగా వస్తాయి. మన శరీరం నుంచీ వచ్చే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అంటే దోమలకు చాలా ఇష్టం అందుకే చేతులపై చెమట పట్టిన వెంటనే వాలిపోతాయి. ఇవి దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణాలు.