నేడు మళ్లీ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన వంగవీటి రాధా!

నేడు మళ్లీ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన వంగవీటి రాధా!

0
84

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం మరోసారి సమావేశమయ్యారు. నిన్న విజయవాడ పటమటలోని పవన్ నివాసానికి వచ్చి, దాదాపు గంట పాటు మంతనాలు సాగించిన రాధా, ఈ ఉదయం మరోసారి వచ్చారు.

ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారని, ఈ ఉదయం భేటీలో ప్రధానంగా ఇదే విషయం చర్చకు వచ్చిందని, వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా రాధా, జనసేనలో చేరుతారని తెలుస్తోంది. వచ్చే నెల 4 లేదా 5వ తేదీల్లో పార్టీలో చేరికకు ముహూర్తం నిర్ణయించడం కూడా జరిగిపోయిందని జనసేన వర్గాలు అంటున్నాయి. కాగా, వీరిద్దరి భేటీపై అటు జనసేన పార్టీ తరఫున గానీ, ఇటు వంగవీటి రాధా నుంచి గానీ, అధికారికంగా ఎటువంటి స్పందనా లేదు.