మిరియాలు రోజూ వాడండి ఆరోగ్యంగా ఉండండి అని అనేక కొటేషన్లు చూస్తు ఉంటాం. అంతేకాదు మన పెద్దలు కూరలు, రసం, చారు, ఇలాంటివి పెడితే ఆ మిరియం ఘాటు తగిలేలా వేసేవారు. పంటి కింద మిరియం పడిదంటే ఇక అన్నం తినేవరకూ దాని ఘాటు అలాగే ఉంటుంది. ఇక టీలు, పాలల్లో అనేక రకాలుగా మనం మిరియాలు వాడుతూ ఉంటాం. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలో మిరియాల రసం బాగా చేసుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే ఈ మిరియాల వల్ల ఏం లాభాలు అనేది చూద్దాం. మలబద్ధకం సమస్యలు రాకుండా ఉండాలన్నా, గ్యాస్ సమస్యలు పోవాలన్నా వంటల్లో మిరియాలు వాడాలి. మనం తరచూ మిరియాలు వాడుతూ ఉంటే కాన్సర్ అనేది దరిచేరదు. బరువు తగ్గాలనుకునేవారు మిరియాలు తరచూ తీసుకోండి. శరీరంలో కొవ్వుతగ్గిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండేలా చేస్తాయి.
మీకు సీజన్ మారిన సమయంలో గొంతులో గరగర, దగ్గు, జలుబు వంటివి ఏవి ఉన్నామిరియాలను తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. మగవారి సంతానానికి కూడా నల్ల మిరియాలు బాగా ఉపయోగపడతాయి. బొల్లి సమస్య రాకుండా ఈ మిరియాలు కాపాడతాయి. అల్జీమర్స్ సమస్యకు మిరియాలు చెక్ పెడతాయి. మిరియాలు తినే వారికి చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తాయి మిరియాలు.