Breaking News : భారత్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం – ఎక్కడంటే

First bird flu death in India

0
97

ఓ పక్క దేశంలో కరోనాతో ఇబ్బంది పడుతుంటే , మరో పక్క బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూకు చికిత్స పొందుతూ చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో ఇదే తొలి బర్డ్ ఫ్లూ మరణం. దీంతో అధికారులు వైద్యులు అక్కడ అప్రమత్తం అయ్యారు.

ఢిల్లీ ఎయిమ్స్ లో అతడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్లోకి వెళ్లారు. న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో బాధపడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ లో చేరిపించారు. అతనికి ముందు కరోనా పరీక్ష చేశారు అయితే నెగిటీవ్ అని వచ్చింది. కానీ అనుమానంతో వెంటనే పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు నమూనాలు పంపించారు.అక్కడి పరీక్షల్లో బాలుడికి సోకింది బర్డ్ ఫ్లూ అని గుర్తించారు.

అయితే ఈ వ్యాధి పక్షులకి, కోళ్లకి వస్తుంది కదా మనిషికి రావడం ఏమిటి అని చాలా మంది షాక్ అవుతున్నారు.
ఈ ఏడాది మొదట్లో మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఈ వ్యాధి వణికించింది. పంజాబ్లోనే 50 వేలకు పైగా పక్షులు మరణించాయి. భయపడాల్సినంత ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు వైద్యులు.