ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సినీనటుడు కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం.. విజయ నిర్మల భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం అనంతరం నానక్‌రామ్‌గూడ వెళ్లిన ముఖ్యమంత్రి.. కృష్ణను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ఉన్నారు.
విజయ నిర్మలకు సీఎం కేసీఆర్ నివాళి
విజయ నిర్మలకు సీఎం కేసీఆర్ నివాళి