ఓలా ఎలక్ట్రిక్ బైక్ మొత్తం 10 రంగులు – ఒక్కరోజులోనే లక్ష మందికిపైగా బుకింగ్

Ola electric bike total 10 colors

0
109

ఇక వచ్చే రోజుల్లో చాలా వరకూ ఎలక్ట్రిక్ బైకుల కాలం రానుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా కంపెనీలు వీటిపైనే ఫోకస్ చేశాయి. ఇక మన దేశంలో ఓలా ఎలక్ట్రిక్ బైకుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక దీని కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. వీటి డిమాండ్ ఎలా ఉంది అంటే, జులై 14న బుకింగ్స్ మొదలైతే ఒక్కరోజులోనే లక్ష మందికిపైగా బుక్ చేసుకున్నారు.

ఇక ఈ బైక్ ఏ కలర్స్ లో వస్తుంది అనేది ఓలా ఎలక్ట్రిక్ సీఈవో, చైర్మన్ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం 10 రంగుల్లో బైకును అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇక చాలా మంది తమకు నచ్చిన కలర్ కోసం ముందే ఆలోచన చేస్తున్నారు.
నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, వెండి, ఊదా, తెలుపు వంటి 8 కలర్స్ చెప్పారు. (కింద వీడియో మీరు చూడవచ్చు)

ఇక వీటి ఫీచర్లు చూస్తే ఈ బైక్ చార్జింగ్ చేసిన తర్వాత ఈజీగా 100 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రెండు హెల్మెట్లు పట్టేంత డిక్కీ స్పేస్ ను ఇస్తున్నారు. డిజైన్ కూడా సూపర్ ఉంటుంది. బ్యాటరీని బయటకు తీసి చార్జింగ్ పెట్టుకునే సౌలభ్యం ఉంది. ఇక వీటి ధర ప్రకటించలేదు.

ఈ బైక్ మీరు చూసేయండి.

https://twitter.com/bhash/status/1418081226196275200