మిషన్ ఇంపాజిబుల్ లో తాప్సీ రోల్ ఏమిటంటే

What is Taapsee role in Mission Impossible movie

0
99

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది నటి తాప్సీ. అందంతో పాటు అభినయంతో ఆమె ఆకట్టుకుంటుంది.
యువ కథానాయికల జోడీగా కొన్ని సినిమాలు చేసింది. ఇక ఇక్కడ నుంచి ఆమె బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ పలు సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్ లో ఆమె నటనకి స్కోప్ ఉండే పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళ్లింది.

ఇది ఆమెకు సినిమా పరిశ్రమలో చాలా ప్లస్ అయింది. ఇక ఇలాంటి పాత్రల విషయంలో తాప్సీ చాలా బాగా చేస్తుంది అనే పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ లో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ ఉండే పాత్రలు ఆమెకి వరుసగా వస్తున్నాయి.
ఈ మధ్య తెలుగు నుంచి కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి. తాజాగా ఓ సినిమా చేయనుందట. ఆ సినిమా మిషన్ ఇంపాజిబుల్. సినిమాలో తాప్సీ డేరింగ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో ఉంటుందట. ఇక ఇక్కడ జరుగుతున్న కిరాయి హత్యల విషయంలో వారిని పట్టించే జర్నలిస్ట్ గా ఆమె నటిస్తుంది అంటున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి స్వరూప్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.