ఇదేంటి గూగుల్ – శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్ ఏమైందంటే

Google shocked Shekhar Master fans

0
82

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు  మన రెండు తెలుగు స్టేట్స్ లోఎంతో క్రేజ్ ఉంది. చాలా మంది అగ్రహీరోలతో ఆయన స్టెప్పులు వేయించారు. బుల్లితెరపై కూడా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు శేఖర్ మాస్టర్. జబర్ధస్థ్, ఢీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మరో పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు శేఖర్ మాస్టర్. తాజాగా ఆయన అభిమానులకు గూగుల్ షాకిచ్చింది.

దీంతో అందరూ ఇదేంటి అని షాక్ అవుతున్నారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్ పొరపాటు ఇప్పుడు శేఖర్ మాస్టర్ అభిమానులక కోపం తెప్పించింది.గూగుల్ సెర్చ్ ఇంజిన్లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే శేఖర్ మాస్టర్ ఫోటోస్ చూపిస్తుంది. కాని ఇక్కడ ఆయన వివరాలు కాకుండా వేరే వారివి వస్తున్నాయి.

శేఖర్ మాస్టర్ జననం మరణం తేదీలను కూడా చూపిస్తుంది. ప్రస్తుతం బతికి ఉన్న శేఖర్ మాస్టర్ 2003లో కన్నుమూసినట్లుగా చూపిస్తుంది. అయితే ఇక్కడ జరిగిన తప్పిదం ఏమిటి అంటే? తెలుగు, తమిళ, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ శేఖర్ బయోడేటాను గూగుల్ శేఖర్ మాస్టర్ది అంటూ చూపిస్తుంది. దీనిని అర్జెంట్ గా మార్చాలి అని ఆయన అభిమానుల కోరుతున్నారు.