తమిళనాడు లో దారుణం జరిగింది. ఇద్దరు కూతుళ్లు తల్లిని కడతేర్చారు. .తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్పిచ్చై ఉషా దంపతులకు కుమార్తెలు నీనా, రీనా ఉన్నారు. ఇక ఈ పేరెంట్స్ కి మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.. నీనా, రీనా ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇక ఇద్దరు కుమార్తెలకి కొద్దిరోజులుగా మతిస్ధిమితం సరిగ్గాలేదు.
మధ్యాహ్నం ఉషతో కుమార్తెలు గొడవపడ్డారు. ఇక పక్కవారు అరుపులు విని అక్కడకు వచ్చారు. ఇక ఉష చనిపోయి ఉంది.
తల్లిని కొట్టి చంపి ఆ రక్తంలోనే ఆడుకోవడం కలిచివేస్తోంది. తల్లి రక్తాన్ని బొమ్మలకు పూస్తూ ఆడుకుంటుంటూ కనిపించారు.
టీచర్ అయిన ఉష నిన్న ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానించారు. అరుపులు కూడా వినిపించడంతో వెంటనే లోపలకి వెళ్లారు.
చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు.కత్తి, ఇనుపరాడ్తో దాడి చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. చివరకు ఆ ఇద్దరు కుమార్తెలపై కేసు నమోదు చేశారు.