ఈ అమ్మాయికి గుండె కుడివైపున ఉంది – వైద్యులు ఏమన్నారంటే

The heart of this girl is on the right-What the doctors said

0
106

సాధారణంగా గుండె ఎవరికి అయినా ఎడమవైపున ఉంటుంది. అయితే ఇక్కడ ఓ అరుదైన కేసు గుర్తించారు వైద్యులు. అమెరికాకు చెందిన క్లేరీ మాక్ అనే యువతికి గుండె కుడివైపున ఉంది. ఈ కేసు చూసి వైద్యులు షాక్ అయ్యారు. 19 ఏళ్ల క్లేరీ మాక్ షికాగో నగరవాసి. ఆమె రెండు నెలలుగా దగ్గుతో బాధపడుతుంది.

ఇక ఆస్పత్రిలో మందులు తీసుకుంది. ఇక దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల వ్యాధి అయి ఉంటుంది అని వైద్యులు భావించారు. ఇక ఆమెకి అన్నీ రకాల పరీక్షలు చేయించారు. ఎక్స్ రే చూసిన వైద్యులు షాక్ అయ్యారు.

క్లేరీ మాక్ కు గుండె కుడివైపున ఉండడాన్ని వారు గుర్తించారు. ఇక ఆమె కూడా ఈ వార్త అస్సలు నమ్మలేకపోయింది. అదేమీ ప్రమాదకరం కాదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. దీనిని డెక్స్ ట్రో కార్డియా అంటారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు వైద్యులు. ఇలాంటి కేసులు చాలా రేర్ అని తెలిపారు వైద్యులు.