ఆధార్ తో ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలనే వారికి గుడ్ న్యూస్ . వీరికి తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఇలా మీరు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి ఆధార్ సీడింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఆ పని పూర్తిచేసేలా సరికొత్త సేవలను ఏపీలో ప్రారంభించింది. ఈ సర్వీస్ కోసం 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
పోస్ట్‌మ్యాన్‌కు కబురందిస్తే అతడే ఇంటికి వచ్చి క్షణాల్లో ఆధార్‌తో ఫోన్ నంబరును అనుసంధానం చేస్తారు. ఇక ఇలా అనుసంధానం చేయడానికి ఓ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. దీంతో వారు మీ ఫోన్ నెంబర్ ఆధార్ తో అనుసంధానం చేస్తారు. ఇక ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటికే 5 లక్షలమంది వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. అన్నీ ప్రాంతాల్లో ఈ సర్వీసుని బాగా ఉపయోగించుకుంటున్నారు. గుడివాడ, ఏలూరు, భీమవరం, నెల్లూరు, విజయనగరం డివిజన్లలో ఎక్కువమంది ఈ సేవలు పొందారు. మీరు ఈ సేవలు మీ పోస్టల్ కార్యాలయం నుంచి పొందవచ్చు.