చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాపై మ‌రో వార్త – టాలీవుడ్ టాక్

Ram Charan shanker movie updates

0
126

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆచార్య సినిమా చేశారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాల త‌ర్వాత ఆయన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా పై ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయనున్న చిత్రం గురించి టాలీవుడ్ కోలీవుడ్ లో ఒక‌టే చ‌ర్చ న‌డుస్తోంది.

అస‌లు శంక‌ర్ ఎలాంటి చిత్రం చేయ‌నున్నారు అనే చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ కెరియ‌ర్లో 15 వ సినిమా అవుతుంది. ఈ సినిమా పై ప్ర‌క‌ట‌న వ‌చ్చిన స‌మ‌యం నుంచి అనేక వార్త‌లు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రో వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు మొన్న‌టి వ‌ర‌కూ వార్తలొచ్చాయి.
చరణ్ ఇందులో తండ్రి- కొడుకులుగా రెండు విభిన్న పాత్రలను పోషిస్తార‌ట. ద‌ర్శ‌కుడు చాలా స‌రికొత్త‌గా దీనిని డిజైన్ చేశార‌ట‌. ఇక గ‌తంలో చ‌ర‌ణ్ నాయ‌క్ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేశారు. రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు అందిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.