కొందరికి చిన్న వయసులోనే వృద్దాప్య లక్షణాలు వస్తూ ఉంటాయి. అయితే 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఇలాంటి లక్షణాలు వచ్చి ఆస్పత్రులకి వచ్చే వారిని చూసి ఉంటాం. కాని ఇప్పుడు ఓ వ్యాధి ఓ బాలికని చాలా ఇబ్బంది పెట్టింది. హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ చెప్పాలంటే ఇది ఒక అరుదైన సిండ్రోమ్. రెండు కోట్లమందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం.
ఈ వ్యాధి వస్తే వారు చాలా ముసలి వారిలా కనిపిస్తారు, టీనేజ్ లో ఉన్న వారికి ఇది వస్తే వృద్యాప్యం వచ్చేస్తుంది . బ్రిటన్ కు చెందిన అషాంటీ స్మిత్ అనే అమ్మాయి కూడా ఈ హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడుతూ చికిత్స పొందుతూ కన్నుమూసింది.
అషాంటీ కి 8 ఏళ్లు వయసు ఉన్నప్పుడు ఈ సిండ్రోమ్ గుర్తించారు. ఆమె ఇలా పది సంవత్సరాలు ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు . తీవ్ర వృద్ధాప్య లక్షణాలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమె చివరి వరకూ నవ్వుతూనే ఉండేదట. ఆమెకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని ఆమె తల్లి తెలిపారు. ఆమె మరణంతో అందరూ సంతాపం తెలియచేస్తున్నారు.