చిన్నారులు పడుకుంటే పాము కాటువేసింది తెల్లారేసరికి దారుణం

bitten by a snake when little girls are sleeping

0
105

ఇది వర్షాకాలం ఈ సమయంలో పాములు కూడా ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తలుపులు ఎక్కువ సేపు వేసే ఉంచాలి. ఇక గుజరాత్ లో దారుణం జరిగింది. గిర్ సోమనాథ్లోని ఉనా ఏరియాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు పాము కాటుతో చనిపోయారు.

రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనాలు చేశారు. ఆ తర్వాత అందరూ పడుకున్నారు. అక్కా, చెల్లి ఒకే చోట పడుకున్నారు. బాగా నిద్రలో ఉన్న సమయంలో వారిని పాము కరిచింది. అయితే వారికి పాము కరిచిన సంగతి తెలియలేదు. ఉదయం తల్లి వచ్చి వారిని లేపినా పిల్లలు ఎంత వరకూ లేవలేదు. దీంతో తండ్రి వచ్చి లేపాడు, అయినా లేవలేదు. వారి శరీరం పై చూస్తే పాము కాటు వేసిన కాటు గుర్తులు కనిపించాయి.

వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళితే వారు చనిపోయి కొన్ని గంటలు అయింది అని తెలిపారు .అక్కడికి దగ్గర్లోనే పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో పాము తిరుగుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. నిధి వయసు 12 ఏళ్లు, వానికా వయస్సు 10 ఏళ్లు. ఇద్దరూ నిద్రలోనే చనిపోయారు. కుమార్తెలు ఇద్దరు మరణించడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.