Breaking News : రాజ్ కుంద్రాకు సొంత కంపెనీ ఉద్యోగులు షాక్

Raj Kundra's own company employees shock

0
125

నీలి చిత్రాల రాకెట్ కేసు గురించి ఇప్పుడు బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు రాజ్ కుంద్రా. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఆయన కంపెనీ ఉద్యోగులే సిద్ధమయ్యారని తెలుస్తోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ నీలిచిత్రాలకు సంబంధించి రాకెట్ లో ఇంకా ఎవరు ఉన్నారు అనేదానిపై కూడా అన్నీ విషయాలు విచారిస్తున్నారు పోలీసులు. కుంద్రా పై నీలి చిత్రీకరణ చేస్తున్నట్లు అంతే కాకుండా వాటిని ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు మోడల్స్ కూడా కుంద్రా గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు.

అయితే ఇవే కాకుండా త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫెమా కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉంటారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.