విషపు పాము కాటువేస్తే ఈ లక్షణాలు వేగంగా కనిపిస్తాయి

These symptoms appear faster if the venomous snake bites

0
363

పాము కాటు వల్ల ప్రతీ ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అసలు ఏ పాము కరిచిందో తెలియక అది విషపు పాము కాదు అని ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అసలు పాము కరిచిన విషయం తెలియక చికిత్స అందుకోక ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రైతులు పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.
విషపూరితమైన పాము కాటు వేస్తే మనిషి ప్రాణాలకు ప్రమాదం. ఒకవేళ పాము కాటేసినప్పుడు అది విషపూరితమైన పాము కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు.

అయితే పాము కాటు వేస్తే మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయట. పాము కాటు వేస్తే అక్కడ రెండు గాట్లు (కన్నాలు) పక్కపక్కనే పడి ఉంటే అది విషపూరితమైన పాము అని తెలుసుకోవాలి. అక్కడ వెంటనే వాపు కూడా వస్తుంది. అంతేకాదు పాము కాటు వేసిన చోట విపరీతమైన నొప్పి కూడా వస్తుంది. చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. వికారం వస్తుంది. ఇలాంటివి వెంట వెంటనే కనిపిస్తే ఆలస్యం చేయకూడదు.

శరీరం అటు ఇటూ కదపకూడదు. విషం మరింత వేగంగా శరీరమంతా విస్తరించకుండా ఉంటుంది. రోగిని ఆందోళన చెందకుండా చూడాలి. ఇక రక్తం తీసేందుకు విషం లాగేందుకు ఎలాంటి కత్తిగాట్లు చేయవద్దు. డాక్టర్లు చాలా మంది యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఇస్తారు దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.