పర్వతాన్ని గుద్ది పండ్లు విరగ్గొట్టుకున్నట్లు / సామాజిక అన్యాయం

0
143

హుజూరాబాద్ టిఆర్ఎస్ నేత పాడి కౌషిక్ రెడ్డి వ్యూహ చతురత తెలియక బొక్క బోర్లా పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారే సమయంలో దళిత, బిసి, మైనార్టీ వర్గాల కార్యకర్తలను వేదిక మీదకు పిలుస్తున్నప్పుడు గారు అని సంబోధించలేదు. కానీ రెడ్డి, వెలమ కులాలకు చెందిన కార్యకర్తలను మాత్రం గారు అని గౌరవంగా సంబోధించి వేదిక మీదకు పిలిచారు. అగ్రవర్ణాలకు ఒక తీర్గ, బహుజనులకు మరో తీర్గ పిలుసుడేంది అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కౌషిక్ రెడ్డి మైలేజ్ డ్యామేజ్ చేస్తున్నది.

ఆ వీడియో చూసిన మాజీ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో తన వాల్ మీద దాన్ని పోస్టు చేశారు. అంతేకాదు.. బ్రదర్ కౌషిక్ రెడ్డి అంటూ… క్లాస్ పీకారు.  వేదిక మీదకు పిలిచే సమయంలో ఇదేం తీరు అని ఎండగట్టారు. ప్రవీణ్ కుమార్ ట్వీట్ కు సంబంధించి మన All Time Report వెబ్ సైట్ లో పోస్టు చేసిన వార్తను కింద చూడొచ్చు.

బ్రదర్ అంటూనే కౌషిక్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైండ్ బ్లోయింగ్ క్లాస్

ఇక దాన్ని కప్పుపుచ్చుకునేందుకు, తాను బహుజన బంధు అన్న కలరింగ్ ఇచ్చేందుకు పాడి కౌషిక్ రెడ్డి ఎంత ఆపసోపాలు పడ్డారో… ఆయనకే ఎరుక. పైగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్థాయిని తగ్గించుకున్నారు అంటూ 6 సెకన్ల వీడియోను ట్విట్టర్ లో తన వాల్ మీద పోస్టు చేసి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కౌషిక్ రెడ్డి తాలూకు వార్త లింక్ కింద ఉంది చూడొచ్చు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కౌషిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఇక అసలు సబ్జెక్టుకు వస్తే.. పాడి కౌషిక్ రెడ్డి పర్వతాన్ని గుద్ది పండ్లు రాలగొట్టుకున్నట్లే ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ మొదలైంది. పొరపాటు జరిగింది క్లియర్ గా వీడియోలోనే ఉంది. రెడ్డి కులానికి చెందిన వారిని, వెలమ కులానికి చెందిన వారిని గారూ అంటూ పిలిచి, బిసి, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారిని మాత్రం పేర్లు పెట్టి పిలిచినట్లు నిమిషం పాటు ఉన్న వీడియో కూడా ఉంది. జరిగిందేదో జరిగింది… పొరపాటైందని సవరణ ఇచ్చి బయటపడేదిపోయి… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో గోక్కోవడం, పైగా ప్రవీణ్ స్థాయి తగ్గించుకున్నారంటూ కామెంట్లు చేయడం చూస్తే పర్వతాన్ని ఢీకొట్టే ప్రయత్నమే అని అంటున్నారు. నిజంగా ఈ రెండు వీడియోల్లో ఏది నిజం, ఏది ఫేక్ అన్నది తేల్చాల్సి వస్తే పాడి కౌషిక్ రెడ్డి స్థాయి పాతాలానికి పడిపోవడం ఖాయమని చెబుతున్నారు. పైగా తన గురించి అతిగా ప్రచారం చేసుకోవడం చూస్తే… పార్టీ మారుతున్నవేళ డబ్బులు పంచుతానని ఆడియో క్లిప్ లు బయటకు రావడంతో ఒకరౌండ్ ఇజ్జత్ పోగొట్టుకోగా మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పెట్టుకుని నవ్వులపాలయ్యాడని ఆర్ఎస్ ప్రవీణ్ సన్నిహితుడొకరు మండిపడ్డారు. .

పాడి కౌషిక్ రెడ్డి వేదిక మీదకు పిలిచిన ఎస్సీ నేతల్లో ఒక్కరిని మాత్రమే గారు అని సంబోధించి మిగతా వారిని అలా పిలవలేదు. ఎవరిని ఎలా పిలిచారో కింద లిస్ట్ ఉంది చూడొచ్చు…

1) టి. సత్యనారాయణ రావు( వెలుమ) గారు

2) రామస్వామి (మదిగ) గారు.

3) తక్కల్లపల్లి సత్య నారాయణ (వెలుమ) గారు

4) తిరుపాల్ రెడ్డి (రెడ్డి) గారు

5) మైపాల్ రెడ్డి గారు

6) సమ్మి రెడ్డి గారు

7) సుధాకర్ (మాల)

8) భానుచందర్ – (మాదిగ)

9) మ్యాక సమ్మయ్య  (మున్నూరుకావు)

10) మర్రి శ్రీనివాస్ రెడ్డి గారు (ఈయనకు గారు అని సంబోధన)

11) చింత శ్రీనివాస్ గౌడ్

12 సాయి(బీసీ),

13 అంజద్(ముస్లిం)

14 రావుల వెంకట్ (బీసీ) చాకలి

ఇలా అగ్రవర్ణాలకు గారుతో పిలవడం, మిగతా వర్గాల వారిని గారు లేకుండా పిలవడం వివాదం రగిలించింది.

పాడి కౌషిక్ రెడ్డి వీడియో కింద చూడొచ్చు.

https://fb.watch/v/26MyptoaX/