అందరూ ఆ జడ్జి రోడ్డు ప్రమాదంలో మరణించారు అని అనుకున్నారు. కాని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు నిజం బయటపడింది. ఆ జడ్జికి జరిగింది ప్రమాదం కాదు కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపేశారని తెలుస్తోంది అంటున్నారు . ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగింది.
తెల్లవారు జామున 5 గంటలకు ధన్ బాద్ జిల్లా అదనపు జడ్జి ఉత్మ్ ఆనంద్ జాగింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన వెనుక నుంచి ఓ ఆటో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఇది ప్రమాదంగా అందరూ అనుకున్నారు. అయితే రోడ్డు అంతా ఖాళీగా ఉంది అయినా ఆ ఆటో సమీపంలోకి వచ్చి ఆయనని ఢీకొట్టింది.
స్థానికులు చూసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ప్రకటించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చివరకు పోలీసులు ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు . అయితే అది దొంగిలించిన ఆటో అని తెలిసింది. విచారణలో అన్నీ విషయాలు తెలియనున్నాయి.
ఈ వీడియో చూస్తుంటే ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారు అని అంటున్నారు ఈ వీడియో చూడండి
https://twitter.com/i/status/1420376256923660288
#Watch | Judge killed in accident in #Dhanbad. Incident caught on cam.
Meghna Deka with details. pic.twitter.com/RBILCnRWFe
— TIMES NOW (@TimesNow) July 28, 2021