యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో కనకరాశులు, లెక్కలు ఇవే

0
72

యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లక్ష్యంగా ఎసిబి అధికారులు రెండురోజులపాటు జరిపిన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్ లోని మేడిపల్లిలో ఉన్న దేవానంద ఇంట్లో, యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు నిన్నటినుంచి సోదాలు జరిపారు.

ఆయన ఇంట్లో అంతులేని సంపద అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు సోదాలు జరిపి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, ల్యాండ్ డాక్యుమెంట్లు నమోదు చేశారు. ఆ వివరాలు…

సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో 76,09,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. 7.09 ఎకరాల ల్యాండ్ పాస్ బుక్ లు, 200 గజాల ప్లాట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

దేవానంద ఇంట్లో స్వాధీనం చేసుకున్న సొమ్ముల తాలూకు వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.

https://fb.watch/73C-ok7QAt/