బిగ్ బాస్ సీజన్ 5 కి వెళుతున్నారా – లోబో ఫస్ట్ రియాక్షన్

anchor lobo first reaction on bigg boss 5 show

0
116

బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకులంతా ఐదవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా హోస్ట్ గా కనిపించనున్నారట. కొన్ని రోజులుగా కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. ఇషా చావ్లా, యాంకర్స్ వర్షిని, శివ, లోబో రవి, , సింగర్ మంగ్లీ, టీవీ9 న్యూస్ ప్రజెంటర్ ప్రత్యూష, టిక్ టాక్ దుర్గారావు వీరి పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు లోబో గురించి ఎక్కువగా టాక్ నడుస్తోంది. లోబోకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్ నుంచి యూత్ చాలా మంది ఈ క్రేజీ స్టార్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అని కోరుకుంటున్నారు. అప్పుడు సింగర్ రాహుల్ కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు లోబోకి కూడా అంతే మాస్ ఫాలో యింగ్ ఉంది.

లోబోని మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళతారా అని ఓ ఛానల్ ప్రశ్నిస్తే, కచ్చితంగా ఆ అవకాశం వస్తే వెళతా అని చెప్పారు. నేను ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం చూస్తున్నా అన్నారు.
లోబో డిఫరెంట్ టాటూలతో, స్టైలిష్ లుక్ తో ఉంటారు. చాలా సరదా మనిషి. ఇక ఆయనకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయనని హౌస్ లోకి వెళ్లాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు లోబోకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందా అంటే ఎలాంటి సమాధానం చెప్పలేదు. తాను మాత్రం అవకాశం వస్తే కచ్చితంగా వెళతా. ఆ దేవుడి విష్ అని చెబుతున్నారు. చూడాలి ప్రకటన వచ్చేవరకూ ఎవరు ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో.