పవన్ పుట్టిన రోజున ఆ అప్ డేట్ రానుందా ?

Will that update come on Pawan kalyan birthday ?

0
83

పవన్ కల్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తర్వాత హరిహర వీరమల్లు సెట్స్ పైకి వెళతారు. ఇప్పటికే ఈ సినిమా కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకుంది.

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. మొగల్ రాజుల కాలం కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఈ సినిమాలో బందిపోటు దొంగగా నటిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే పవన్ లుక్ కి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. వచ్చేనెల 2వ తేదీన పవన్ బర్త్ డే కావడంతో ఈ సినిమాకి సంబంధించి ఓ అప్ డేట్ రానుందని, ముఖ్యంగా మేకింగ్ వీడియో రావచ్చు అంటున్నారు. ఈ టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. భారీగా సెట్లు వేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం చాలా మంది సీనియర్ నటులు, టెక్నిషియన్లని తీసుకున్నారు. పదుల సంఖ్యలో గుర్రాలు తీసుకున్నారు. ఇక పవన్ లుక్ విషయంలో, పవన్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ టాక్ ప్రకారం వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.