పవన్ కల్యాణ్ తో బండ్ల గణేష్… ఆ ప్లాన్ చేస్తున్నారా ?

0
105

పవన్ కల్యాణ్ ని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎంతలా ఆరాధిస్తారో తెలిసిందే. నా దేవుడు అని పిలుస్తారు ఇక ఆయనతో మరో సినిమా తీయాలని చూస్తున్నారు బండ్ల గణేష్. పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను బండ్ల గణేశ్ నిర్మించాడు. ఈ సినిమా మాత్రం ఆయన కెరియర్లో ఎంత సూపర్ హిట్ చిత్రమో తెలిసిందే.

ఆ సినిమా చేసే సమయం నుంచి పవన్ – గణేశ్ ల మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది.
రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కొంత గ్యాప్ తరువాత వకీల్ సాబ్ చిత్రం చేశారు. ఇప్పుడు పలు కథలు వింటున్నారు, మరో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో మరో సినిమా చేయడానికి బండ్ల గణేశ్ రంగంలోకి దిగారనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో.

ఇక చాలా మంది దర్శకుల దగ్గర మంచి కథ కోసం గణేశ్ సెర్చ్ చేస్తున్నారట. పవర్ఫుల్ స్టోరీలు రెడీ చేయమని సీనియర్ దర్శకులకు చెప్పారట. ఇక యంగ్ డైరెక్టర్లు కొంత మంది కథ వినిపించడానికి వచ్చినా వారి కథలు కూడా వింటున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కథ తనకి నచ్చితే పవన్ దగ్గరికి ఆ దర్శకుడిని తీసుకువెళ్లే దిశగా బండ్ల గణేష్ ఆలోచిస్తున్నారని వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. బహుశా ఈ ఏడాదిలో వారి నుంచి సినిమా ప్రకటన రావచ్చు అంటున్నారు వీరి ఫ్యాన్స్.