మరికొన్ని గంటల్లో పెళ్లి – అబ్బాయికి వచ్చిన ఆ ఒక్క వీడియోతో పెళ్లి క్సాన్సిల్

Wedding Cancel with a single video

0
104

ఆ పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు కుటుంబానికి వరుడు షాకిచ్చాడు. ఆ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తీరా ఏమైంది అని అడిగితే తన చేతిలో ఉన్న మొబైల్ లో వీడియోలు ఫోటోలు చూపించాడు. దీంతో అమ్మాయి కుటుంబం సైలెంట్ అయింది.

బిహర్ లోని సీతామర్హికి చెందిన రామ్ దేవ్ అనే వ్యక్తి తన మరదలితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి క్యాన్సిల్ అయిన వధువే అతని మరదలు. ఇక పేరెంట్స్ వేరే సంబంధం తీసుకురావడంతో బావకి గుడ్ బై చెప్పింది. బావ మాత్రం తనని పెళ్లి చేసుకోమని కోరాడు ఆమె నో చెప్పింది.తల్లిదండ్రుల బలవంతం మేరకు రామ్ దేవ్ కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది.

దీంతో వరుడి ఫోన్ నెంబర్ సంపాదించి తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను, వీడియోలను నేరుగా పంపాడు ఆమె బావ‌. దీంతో అతను ఈ పెళ్లి చేసుకోను అన్నాడు. అమ్మాయి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశాడు . పోలీసులు కేసు నమోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. వివాహం వ‌ద్ద‌ని వ‌రుడి కుటుంబం అక్క‌డ నుంచి వెళ్లిపోయింది.