శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వీటిని మనం కాపాడుకోవాలి మన ఆహారపు అలవాట్లు కూడా వీటిపై ప్రభావం చూపిస్తుందిస్తాయి. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం కిడ్నీల ప్రధాన భాద్యత. ఇవి 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. కిడ్నీలు శుభ్రంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం.
కచ్చితంగా రోజూ మంచి నీరు ఎక్కువగా తాగాలి రోజుకి 4 లీటర్ల నీరు తాగితే చాలా మంచిది. కిడ్నీ సమస్యలు చాలా వరకూ రావు. ఎందుకంటే నీరు టాక్సిన్ పదార్ధాలను ఫిల్టర్ చేసి తొలగిస్తుంది. మీ మూత్రం ఎటువంటి దుర్వాసన లేకుండా వస్తే మీరు శరీరానికి కావాల్సినంత నీరు తాగుతున్నారు అని అర్థం. బార్లీ నీరు కూడా కిడ్నీలకు చాలా మంచిది. ఎందుకంటే బార్లీ లో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. మీరు బార్లీ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగండి.
మీరు కచ్చితంగా పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష, అరటి పండు, కమలఫలం, నారింజ, కీవీ, అప్రికాట్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి . బెర్రీస్ కూడా తరచూ తీసుకోండి. ఇక వేటికి దూరంగా ఉండాలి అనేది చూస్తే, ఆల్కహాల్, చాక్లెట్ , కెఫిన్ లకు దూరంగా ఉండాలి.