శ్రావణమాసం పూజలు వ్రతాలు ఎక్కువగా ఈనెలలో చేస్తారు. అయితే ఈ నెలలో చాలా మంది ఉత్తరాది వారు
పాలు, పెరుగు, పాల పదార్థాలను వాడటం మానేస్తారు. శివుడికి అభిషేకం కోసం మాత్రమే వాడతారు.
లక్ష్మీదేవికీ, శివుడికీ ప్రీతిపాత్రమైన శ్రావణమాసం రాగానే ఎందుకు తాగరు అనే ప్రశ్న చాలా మంది అడుగుతారు.
దీనికి ఓ కారణం చెబుతారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు… క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల సముద్రం నుంచి విషం బయటకు వచ్చింది. ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడు. అందువల్ల శ్రావణమాసంలో పాలకు దూరంగా ఉంటారు. పాలను ఆయనకు అభిషేకం కోసం వాడతారు. ఇలా స్వామి కృప పొందుతారు.
ఇక ఉపవాసం ఉంటే కొందరు పాలు తాగుతారు ఇలా ఖాళీ కడుపుతో పాలు తాగితే ఖాళీ పొట్టలో పాలు సరిగా అరగక గ్యాస్, ఏసీడీటీ, వాంతులు, డయేరియా సమస్యలు రావచ్చు అందుకే ఈ సమయంలో పాలు తీసుకోరు.