ఈ భూమి మీద పెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెబుతాం. దానిని ఏ ఇబ్బంది పెట్టకుండా ఉంటే అది ఏమీ చేయదు. మనం ఇచ్చిన ఆహారం తీసుకుంటుంది కాదని దాని జోలికి వెళ్లి దానిని కెలికితే మాత్రం దాని తొండం లేదా దాని బలమైన కాలితో అదిమిపట్టి చంపేస్తుంది. ఇక అడవిలో అయినా అంతే ఎలాంటి కృరమైన జంతువులు వచ్చినా ఏనుగులు వాటిని చూసి భయపడవు. సింహాలు చిరుతలు కూడా ఏనుగులు ఉంటే పారిపోతాయి.
తాజాగా ఏనుగుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అడవిలో ఇలాంటి అనేక అరుదైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అడవిలోని ఏనుగులు కొన్ని సరస్సు దగ్గరకు వచ్చి నీరు తాగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ నీటిలో ఉన్న మొసలి దానిపై దాడి చేసింది. ఏనుగుకు కోపమొచ్చింది. తన తొండంతో మొసలిని భూమిలోకి బలంగా నొక్కంది.
చివరకు ఏనుగు ఇలా చేస్తుంది అని అసలు మొసలి ఊహించలేదు. ఇక ఊపిరాడకుండా మొసలిని అలా నీటిలో కాలితో నొక్కి పెట్టింది ఏనుగు . మొసలి ఎంత తప్పించుకుందాం అనుకున్నా కుదరలేదు ఇక్కడ ఈ వీడియో మీరు చూడవచ్చు.
https://twitter.com/i/status/1423877817314340865
Survival of the Fittest!! #wildlife pic.twitter.com/hFWV0va033
— HGS Dhaliwal (@hgsdhaliwalips) August 7, 2021