ఏ కొడుకు అయినా పనీపాటా లేకుండా ఇంట్లో కూర్చుని ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. కచ్చితంగా చివాట్లు పెడతారు. ఇక్కడ అదే జరిగింది కాని ఆ చివాట్లతో పాటు ఆ యువకుడి తండ్రి చేసిన పనికి ఆ కుటుంబానికి ఓ అదృష్టం వరించింది. సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
సౌత్ కొరియాలో ఓ తండ్రి తన కొడుకు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండటం తట్టుకోలేకపోయాడు. ఏదో విధంగా అతన్ని మార్చాలి అని అనుకున్నాడు. అతనిపై నిరసనగా రోజూ చెత్త తెచ్చి ఇంటి దగ్గర వేసేవాడు. ఇలా ఇంటి చుట్టు చెత్త పోగు వేసేవాడు. చివరకు పదేళ్లకు పైగా ఇలా చెత్త వేయడంతో అతని భార్య అనారోగ్యం పాలైంది.
చివరకు డాక్టర్లు ఆ చెత్త అంతా తీయమన్నారు. దీంతో అతను చెత్తని తొలగించాడు. అయితే అందులో ఐరన్ ప్లాస్టిక్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మితే సుమారు అతనికి కోట్ల రూపాయలు వచ్చిందట. కొందరు 30 కోట్లు పైనే వచ్చింది అంటున్నారు. ఇక కొడుకుపై కోపంతో చేసిన పని అతనిని కోటీశ్వరుడ్ని చేసింది అంటున్నారు అక్కడ వారు. స్ధానికంగా మీడియాలో ఈ వార్త హైలెట్ అయింది.