తమిళనాడులో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సముద్ర ఖని.
రఘువరన్ బీటెక్ సినిమా ద్వారా ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆయన నటనకు చాలా మంది ముగ్దులు అయ్యారు. ఇక రచయితగా దర్శకుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది. ఇక ఆయన నటనకి మెచ్చి చాలా మంది దర్శక నిర్మాతలు ఆయన్ని తమ సినిమాల్లో తీసుకుంటున్నారు.
తండ్రిగా మామగా విలన్ గా ఆయన పాత్రలకు మంచి పేరు వస్తోంది. అల వైకుంఠపురం సినిమాలో ఆయన పోషించిన అప్పలనాయుడు పాత్ర ఎంతో పేరు తెచ్చింది. క్రాక్ సినిమాలో చేసిన కటారి కృష్ణ పాత్ర మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆర్ ఆర్
ఆర్ లో కూడా ఆయన నటిస్తున్నారు. ఇక మరో రెండు మూడు సినిమాలు కూడా నటిస్తున్నారట.
రానా సోదరుడు అభిరామ్ హీరోగా దర్శకుడు తేజ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ద మవుతున్నారట. ఈ వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఆయనతో చర్చలు జరుపుతున్నారని టాక్ .