శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు పండుగలు నోములు ఎన్నో చేసుకుంటారు. ఈ సమయంలో శుభకార్యాలు జరుపుకుంటారు. అయితే కచ్చితంగా చాలా మంది మహిళలు వివాహం అయిన వారు తొలి ఏడాది ఈ నెలలో నోములు పడతారు. అలాగే వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం కూడా ఆచరిస్తారు.
ఈ వ్రతం ఆచరిస్తే మహిళలకు ఐదవతనం కలకాలం నిలుస్తుందని కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. ఈ నెలలో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ మంగళగౌరిని పూజిస్తారు. ఈ వ్రతం ఎలా ఆచరిస్తారు అంటే. వివాహం అయిన స్త్రీలు మొదటి ఏడాది పుట్టిన ఇంట్లో తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో ఏడాది 15 మందికి. నాలుగో ఏడాది 20 మందికి ఐదో ఏడాది 25 మంది ముత్తయిదువులని పిలిచి తాంబూలం తో వాయనమివ్వాలి. అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.