పిస్తాపప్పు తింటున్నారా మరి దీని వల్ల లాభాలు తెలుసుకుందాం

Do you eat pistachios and find out the benefits?

0
83

మనం పిస్తా పప్పు మాట వినగానే టేస్ట్ చాలా బాగుంటుంది. కాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని అంటాం. అయితే ఇది మాత్రం ఆరోగ్యానికి చేసే మేలు చూస్తే కచ్చితంగా ధర ఎక్కువ ఉన్నా కొనుక్కోవచ్చు ఎందుకంటే దీనిని తింటే చాలా రోగాలు మన దగ్గరకు రావు. అంతేకాదు దీని వల్ల శరీరానికి చాలా పోషకాలు అందుతాయి.నట్స్ లో పిస్తా పప్పు ఒకటి.

పిస్తాపప్పుల్లో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఊబకాయ సమస్య ఉండదు, ముఖ్యంగా బరువు తగ్గాలి అని భావించేవారు పిస్తాని తినండి. పిస్తాపప్పులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటికి చాలా మంచిది.
పిస్తాపప్పులు కీమో-నివారణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది వారానికి ఓసారి తీసుకున్నాక్యాన్సర్ ని దూరం చేస్తుంది.

పిస్తా గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది. మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు అప్పుడప్పుడూ ఈ పిస్తా తీసుకోవచ్చు.
మీకు తెలుసా పిస్తాలో కాల్షియం కూడా ఉంటుంది.