మనం ఎప్పటి నుంచో కాలికి నల్లదారం తాడులు కట్టడం చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలా తాడులు కట్టడం చూస్తున్నాం. అయితే పెద్దలు కనుదిష్టి తగలకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా దారం కడతారు. ఎప్పటి నుంచో దీనిని మనం పాటిస్తున్నాం. ఇప్పుడు యువత కాలుకి మెడకి చేతికి నల్లటి దారం కట్టుకోవడం ఫ్యాషన్ అయింది. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇలా కట్టుకుంటున్నారు.
ఇలా నల్లదారం కట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ నల్ల దారం చెడు శక్తిని నిరోధించే సామర్ధ్యం కలిగి ఉంది అని చెబుతారు. ముఖ్యంగా ఇప్పుడు యూత్ రంగు పూసలను, గజ్జెలను అమర్చుతున్నారు. అయితే ప్రధానంగా నల్ల దారం మన బాడీలో ఉన్న వేడిని హరిస్తుంది. అందుకే ఇలా నల్లదారం పిల్లలకు పెద్దలకు కట్టుకోవడం అలవాటు అయింది.
ఇక చెడు శక్తి రాదని నమ్మకం. గతంలో చాలా దూరాలు ప్రయాణాలు చేసే వారు. ఈ సమయంలో ఎలాంటి గాలి చెడు శక్తి పిల్లలపై ప్రభావం చూపించకూడదు అని ఇలా నల్లదారం కట్టేవారు. ఇప్పటికీ చాలా మంది వీటిని పాటిస్తూనే ఉంటారు. అయితే ప్రముఖంగా ఉత్తరాధి స్టేట్స్ లో కూడా చాలా మంది చెప్పేది నల్లదారం వల్ల చెడు శక్తి రాదని, శరీరంలో వేడి హరిస్తుంది అని చెబుతారు.