ప్రేమిస్తే సినిమాలోలా ఈ ప్రియుడు పిచ్చివాడయ్యాడు

ఈ ఘటన తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

0
72

ప్రేమిస్తే సినిమా చాలా మంది చూసి ఉంటారు. ఆ సినిమాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు వచ్చి తీసుకువెళ్లిపోతారు. దీంతో ఆమె ప్రియుడు చివరకు పిచ్చివాడిగా మారిపోతాడు. ఇప్పుడదే సీన్ తమిళనాడులో చోటుచేసుకుంది. నిజంగా ఈ ఘటన తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

40 ఏళ్ల నాగరాజన్ పుదుకోట్టై జిల్లా మూలక్కుడి గ్రామవాసి. 21 సంవత్సరాల కిందట కుటుంబ పోషణ కోసం కోయంబత్తూరు వెళ్లాడు. అక్కడ ఓ పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నాడు. ఈ సమయంలో అతనిక కేరళ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు చివరకు ఆమెని తన సొంత గ్రామానికి తీసుకువచ్చాడు. ఇక తన చెల్లెల్లకి పెళ్లి చేయాలి అని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు.

కేరళ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఈ విషయం తెలుసుకుని, మూలక్కుడి గ్రామానికి వచ్చి ఆమెను బలవంతంగా తీసుకువెళ్లారు. దీంతో నాగరాజన్ చాలా మనోవేదనకు గురి అయ్యాడు. ప్రియురాలు తన కోసం వస్తుంది అని ఎదురుచూశాడు. ఊరికి దూరంగా ఓ గుడిసె వేసుకుని అక్కడే ఉంటున్నాడు. అతనికి రోజు తల్లి వెళ్లి ఆహరం ఇస్తుంది.

ఈ విషయం పోలీసులు రెవెన్యూ అధికారులు తెలుసుకుని చలించిపోయారు. అతనికి చికిత్స అందిస్తే మాములు వ్యక్తి అవుతాడు అని చెప్పడంతో అతనిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లనున్నారు.