స్మార్ట్ ఫోన్ సైజ్ ఎంత ఉంటుంది చాలా మంది పెద్ద డిస్ ప్లే ఉండాలని, బెటర్ ఎక్స పీరియన్స్ కోసం, వీడియో క్వాలిటీ కోసం మినిమం 5 అంగులాలు నుంచి 6 అంగులాలు కోరుకుంటున్నారు. అయితే తాజాగా చైనాలో ఓ కంపెనీ మాత్రం సరికొత్త టెక్నాలజీతో అతి చిన్న మొబైల్ ని లాంచ్ చేసింది.
చైనాకు చెందిన మోనీ కంపెనీ మింట్ పేరుతో అతి చిన్న సైజులో ఈ ఫోన్ రిలీజ్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ కి 3 అంగుళాల డిస్‍ప్లే మాత్రమే ఉంటుంది. చెప్పాలి అంటే క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ సైజులో ఈ ఫోన్ ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్ ఇది. దీని ధర ఎంతో తెలుసా కేవలం 150 డాలర్ల రూపాయలు అని చెప్పింది కంపెనీ. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద కేవలం 100 డాలర్లకే ఈ ఫోన్ ఇస్తోంది. అంటే కేవలం 7500 కి వస్తోంది.
ఇండీగోగో క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుంటే నవంబర్ లో మొబైల్ డెలివరీ అవుతుంది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్ . డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. 3 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. అంతేకాదు 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ మొబైల్ గూగుల్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ తో వర్క్ చేస్తుంది. మరి చార్జింగ్ ఎంత సేపు వస్తుంది అంటే దాదాపు 72 గంటలు చార్జ్ వస్తుంది.