జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ఫారెన్ లో ఉక్రెయిన్ లో జరుగుతోంది. చివరి షెడ్యూల్ షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు జక్కన్న. మొత్తం టీమ్ అంతా షూటింగ్ అక్కడ జరుపుకుంటోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా సెట్స్ పై మెడలో ఐడీ కార్డు వేసుకున్న ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి చూసి అందరూ బాగున్నాయి అంటున్నారు. అంతేకాదు ఈ ఐడీకార్డుల గురించి తారక్ ఓ విషయం పంచుకున్నారు.
ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఐడీ కార్డు ధరించానని ఎన్టీఆర్ వెల్లడించారు. సెట్స్ మీద ఉండగా ఐడీ కార్డు వేసుకోవడం ఇదే ప్రథమం అని తెలిపారు. ఇక్కడ తారక్ తో పాటు రాజమౌళి కూడా కనిపించారు. ఇక ఐడీ కార్డ్ పై ఆర్ ఆర్ ఆర్ అని పేరు అలాగే తారక్ పేరు ఉంది. ఈ ఫోటోలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.