బిగ్ బాస్-5 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ షో ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. ఇప్పటికే లోగో వదిలారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈసారి కూడా కంటెస్టంట్ల విషయంలో బిగ్ బాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తెరపై కనిపించే వరకూ ఎవరి పేరు బయటకు రాకుండా చూసుకుంటున్నారు.
చాలా మంది పేర్లు కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఫైనల్ చేశారో మాత్రం తెలియదు. సుమారు 100 మందిని పరిశీలించి 20 మందిని లిస్ట్ లో చేరుస్తారు. ఇందులో 18 మంది హౌస్ లోకి వెళ్లవచ్చు అని తెలుస్తోంది. అయితే ఈసారి కూడా సోషల్ మీడియా బుల్లితెర స్టార్లని తీసుకువస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, యాంకర్ వర్షిణిని పేర్లు వినిపిస్తున్నాయి.
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ అని వార్తలు వస్తున్నాయి. దాదాపు వారానికి 8 నుంచి 10 లక్షలు రెమ్యునరేషన్ ఉండవచ్చు అంటున్నారు.బిగ్ బాస్ 4 తెలుగు 6 సెప్టెంబర్ 2020న మొదలై, 20 డిసెంబర్ 2020న పూర్తయ్యింది. అభిజిత్ విన్ అయిన విషయం తెలిసిందే.