ఏదైనా పాలసీ దారుడు చనిపోయే ఆ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి

How to claim that policy if any policyholder dies

0
81

చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకుంటారు .అది ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఆ పాలసీ చేయించుకున్న వ్యక్తి, నామినీ పేరుని పాలసీ తీసుకునే సమయంలో రాయడం జరుగుతుంది. ఇక పాలసీదారుడు మరణిస్తే ఆ పాలసీ నగదు కేవలం నామినీకి మాత్రమే వస్తుంది. మరి ఈ పాలసీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం.

1. కచ్చితంగా ఇది ఆఫ్ లైన్ లో మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి
2. ఈ పాలసీ ఎక్కడ బ్రాంచ్ లో తీసుకున్నారో అక్కడ మాత్రమే క్లెయిమ్ చేయాలి
3. పాలసీ దారుడు మరణించిన విషయాల్లో ఆ నెల రోజుల్లో తెలియచేయాలి
4. అదే సమయంలో పాలసీ కట్టవలసి వచ్చినా ముందు ఈ విషయం బ్రాంచీలో తెలియచేయాలి
5. అక్కడ బ్రాంచ్ అధికారులు ఫామ్ ఇస్తారు వాటిని నామిని ఫిల్ చేయాలి
6. కచ్చితంగా ఆ పాలసీ దారుడు డెత్ సర్టిఫికెట్ కూడా సబ్ మీట్ చేయాలి
7. ఒరిజినల్ బాండ్ పేపర్, అలాగే పాలసీదారుడి ఆధార్, పాన్ ఇవ్వాలి
8. నామినీ పాన్ నెంబర్, ఆధార్ , ఓటర్ ఐడీ ఇవి కూడా జిరాక్స్ ఇవ్వాలి
9.ఇంటిమేషన్ లెటర్ ను కూడా ఆఫీసులో రాసి ఇవ్వాల్సి ఉంటుంది.
10. మీరు సబ్ మీట్ చేసిన డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసుకుని మీకు ఇది ప్రాసెస్ జరుపుతారు.