బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని సినిమాలో ప్ర‌తినాయ‌కుడు ఎవ‌రు?

Who is the villain in the movie Balakrishna with Gopichand Malineni?

0
112

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు . వీరి కాంబోలో ఇది మూడో చిత్రం. ఇక ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య ద‌ర్శ‌కుడు గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించ‌నున్నారు.

క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపిచంద్ ఇప్పుడు బాలయ్య సినిమాను చాలా స‌రికొత్త గా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఓ రేంజ్ మాస్ యాక్ష‌న్ అంశాలు ఇందులో ఉంటాయి అంటున్నారు. ఇక ఈ చిత్రంలో న‌టి వ‌ర‌ల‌క్ష్మి కూడా న‌టిస్తుంది అని వార్త‌లు వినిపించాయి. తాజాగా మ‌రో క్రేజీ వార్త వినిపిస్తోంది. బాల‌య్య సినిమా అంటే క‌చ్చితంగా ప్ర‌తినాయ‌కుడి పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక స‌రైన న‌టుడ్ని తీసుకుంటారు ద‌ర్శ‌కుడు.

తాజాగా బాల‌య్య సినిమాలో ఆ ప్రతినాయ‌కుడి పాత్ర కోసం విజయ్ సేతుపతితో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి అని తెలుస్తోంది. తెలుగులో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు సేతుప‌తి. ఇక వీరి కాంబోలో సినిమా అంటే ఇక రికార్డులు అంటున్నారు అభిమానులు. చూడాలి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే ఇది ఒకే అయిన‌ట్లే అని టాలీవుడ్ టాక్ .