సముద్రంలో నౌక రెండు ముక్కలైంది వీడియో ఇదిగో

Here is the video of the ship being torn in two at sea

0
91

సముద్రంలో నిత్యం కొన్ని వేల నౌకలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. రవాణాలో ఎక్కువగా ఈ నౌకలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గూడ్స్ రవాణాలో నౌకలు ఎంత పెద్దవి ఉంటాయో తెలిసిందే. తాజాగా చమురు రవాణా నౌక క్రిమ్సన్ పొలారిస్ రెండు ముక్కలైంది. అంతేకాదు పెద్ద ఎత్తున ఇందులో ఉన్న చమురు సముద్రంలో కలిసిపోయింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.

జపాన్లోని అమోరి ఫ్రిఫెక్చర్ హచినొహె పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ నౌక నేలను తాకడంతో రెండు ముక్కలైందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా వేస్తున్నారు.
నౌకలోని చమురు సముద్రంలో పడడంతో ఏకంగా 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్పడిందని చెప్పారు.

ఈ వీడియోలో ఇదంతా కనిపిస్తోంది. ఇందులో 21 మంది సిబ్బంది ఉన్నారు. వారు అందరూ క్షేమంగా ఉన్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు అని తెలిపారు. అయితే ఈ చమురు కలవడం వల్ల వేలాది సముద్రపు జీవులు మరణించే ప్రమాదం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

వీడియో ఇదే

https://www.youtube.com/watch?time_continue=42&v=VDn9L–NxNQ&feature=emb_title