ఆ స్టార్ హీరో సినిమాతో ఇలియానా రీ ఎంట్రీ ఇవ్వనుందా ?

Will Ileana make a re-entry with that Star Hero movie?

0
90

టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార ఇలియానా. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆమెకు అనేక చిత్ర సీమల్లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో నటించింది. ఇక టాలీవుడ్ నుంచి కోలీవుడ్ లో కూడా ఆమె వరుస అవకాశాలు సంపాదించుకుంది. అక్కడ కూడా పలు ఆఫర్లు సంపాదించింది.

ఈ గోవా బ్యూటీ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఖిలాడి సినిమా చేస్తూనే మరోవైపు రామరావు ఆన్ డ్యూటీ చేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు చూస్తుంటే . ఖిలాడీ సినిమా ద్వారా ఇలియానా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆమెని ఈ సాంగ్ లో తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు చేశారు ఈ జంట. ఇక మరోసారి ఈ సినిమాతో కలిసి వర్క్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.