ఇటీవల కొందరు ఈ ప్రజలతో విసుగు చెంది అడవి బాటపడుతున్నారు. ఒంటరిగా అక్కడ జీవిస్తున్నారు. వారు కొన్ని సంవత్సరాలు అడవిలో ఉన్న తర్వాత ఆ జీవితం చాలా బాగుంది అని చెబుతున్నారు. ఒంటరిగా దొరికింది తింటూ పచ్చని ప్రకృతి గాలి నీరు దొరికిన ఆహారంతో సంతోషంగా ఉంటున్నారు. ఇలాంటివి చాలా దేశాల్లో జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఇలా చేశాడు. ఓ వ్యక్తి అడవుల బాటపట్టాడు. కొండకోనల్లో జీవిస్తూ, జంతువులు, చేపలను వేటాడుతూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఇతని గురించి అందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అతని పేరు పెట్రోవిక్ వయసు 70 ఏళ్లు
సెర్బియా దేశస్తుడు. దినసరి వేతనంపై కూలీగా పనిచేసే పెట్రోవిక్ ప్రజల్లో పెరిగిపోతున్న చెడును
చూసి తట్టుకోలేకపోయాడు. ఈ సమాజంలో అతనికి ఉండాలనే కోరిక పోయింది.
తన ఆస్తులను ఇరుగుపొరుగు వారికి ఇచ్చేశాడు. రెండు దశాబ్దాల క్రితం జనవాసాలకు దూరంగా వెళ్లిపోయి ఓ కొండగుహలో జీవనం మొదలుపెట్టాడు. అక్కడే కుర్చీలు బల్లలు పెట్టుకున్నాడు. అక్కడే విశ్రాంతి అక్కడ చేపలు పుట్టగొడుగులు తింటూ జీవిస్తున్నాడు. ఇటీవల కరోనా టీకా తీసుకున్నాడు. అప్పుడు ఎవరా అని ఆరాతీస్తే ఆ వ్యక్తి గురించి తెలిసింది మళ్లీ ఆ గుహలోకి వెళ్లిపోయాడు.