ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వ‌చ్చేసింది

Ola electric scooter launched into the market

0
83

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
వ‌చ్చేసింది. ఆగ‌ష్ట్ 15 న స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా తొలి స్కూటర్ ను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని తమిళనాడులోని ఫ్యాక్టరీలో త‌యారు చేసినట్టు తెలిపారు. ఈ క‌రోనా స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డి ఆరు నెల‌ల పాటు స్కూట‌ర్ ని సిద్దం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూటర్ ఉత్పత్తి మొదలైందన్నారు. సిబ్బంది అంకితభావంతో పనిచేశారన్నారు.

గ‌త నెల‌లో ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఒక్క‌రోజులోనే ల‌క్ష‌మంది ఈ స్కూట‌ర్ కోసం బుక్ చేసుకున్నారు. రూ.500 చెల్లింపుతో బుకింగ్ కు అవకాశం కల్పించారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో చాలా మంది విద్యుత్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. ఈ స్కూట‌ర్ కి మంచి డిమాండ్ అయితే ఏర్ప‌డుతోంది.